సెప్టెంబరు 19 నుండి శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు కోవిడ్ కారణంగా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించాం.
అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది..
అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాo
శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం..
బాంబేలో, వారణాసి, జమ్మూ లలోకూడా ఆలయం నిర్మాణం చేపడుతాం..కరోనా ప్రభావం కారణంగా కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగా కూడా విరాళాలు సేకరించి అక్కడ ఆలయాలు నిర్మాణం చేపట్టాలని పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నాం..
ప్రధానంగా టిటిడిలో ఆదాయం పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం..గోల్డు, క్యాష్ డిపాజిట్లు సంబంధించి అధిక వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసాం.
బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్న పిల్లల ఆసుపత్రి ప్రస్తుతం ఏర్పాటు చేయనున్నాం… తరువాత ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తాం
వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేసాం….కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తాం..
4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణం..
కోవిడ్ పరిస్థితులలో టీటీడీ ఉద్యోగులు తెగించి భక్తులకు విశేషమైన సేవలు అందించారు. టీటీడీ ఉద్యోగులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం…
ఉదయస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు, కోవిడ్ కారణంగా ప్రస్తుతం అర్జితసేవలు నిర్వహించడం లేదు కనుక, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు
విఐపి బ్రేక్ సేవకల్పించాలని నిర్ణయం తీసుకున్నాం..
వేస్ట్ వెట్ మ్యానేజ్ మెంట్, డ్రైవ్ మ్యానేజ్ మెంట్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాం..బోర్డు సభ్యులు శ్రీమతి సుధానారాయణ మూర్తి కోటి రూపాయలు డినేషన్ ఇస్తామని తెలిపారు
కంపోస్టు ఎరువును ఉచితంగా రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం..
గోవు సంరక్షణపై పాలక మండలిలో చర్చించాం..ప్రతి ఆలయం వద్ద ఓ గోమాత ఉంచాలని నిర్ణయించాం..
గోవధను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని
తిరుపతిలో రేపటి నుండి మూడు వేల ఉచిత దర్శన టోకెన్స్ జారీని తిరిగి ప్రారంభిస్తున్నాం..
త్వరలోనే సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం
*-వైవీ సుబ్బారెడ్డి గారు, టీటీడీ పాలకమండలి ఛైర్మన్*