Home / SLIDER / కొదండరాం సంచలన నిర్ణయం

కొదండరాం సంచలన నిర్ణయం

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) నిర్ణయించింది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్‌ నేతలు తెలిపారు.

సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయాలని నేతలు అన్నారు.

అయితే ఏ నిర్ణయమైనా పార్టీ సమిష్టిగా తీసుకోవాలని కోదండరాం స్పష్టం చేశారు. దీంతో వీలైనంత త్వరగా మరోసారి సమావేశమై అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ఈలోగా ఇతర పార్టీలు, సంఘాల నేతల అభిప్రాయాలు, మద్దతు ేసకరించాలని అభిప్రాయపడ్డారు. ఇక 2018 ఎన్నికల్లో తాము పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానిపై నివేదిక తయారు చేేసందుకు కమిటీని వేయాలని నిర్ణయించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat