సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వల్ల ‘మీ టూ’ అనే ఉద్యమమే మొదలైంది. చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు.
అయితే ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, ఇందులో సీక్రెట్ ఏమీ లేదని తెలిపారు అనుష్క. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డాను.. కానీ ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడటం వల్ల ఆ సమస్యను తప్పించుకోగలిగానని జేజెమ్మ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.