శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ ఉంది.