జూలై నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజికల్ షో జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవికతో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు. బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఇదే సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి యువ సింగర్ మాళవిక కారణమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాళవికకి కరోనా అని తెలిసిన కూడా ఈవెంట్‌లో పాల్గొందని, ఈమె అందరికి కరోనా అంటించిదని దుష్ప్రచారం చేస్తుండడంతో మాళవిక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.
రామోజీ ఫిలిం సిటీలో జూలై 30,31 తేదీలలో ఎస్పీబీ స్పెషల్ ఎపిసోడ్స్ జరిగాయి. జూలై 30న చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు. నేను 31 పార్టిసిపేట్ చేశా. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళా. బాలుగారు ఆగస్ట్ 1న నాకు మెసేజ్ చేశారు. వరుస షూటింగ్స్ వలన అలసిపోయాను అని నాకు మెసేజ్ పెట్టారు. ఆగస్ట్ 5న ఆయన కరోనా సోకినట్టు వీడియో ద్వారా తెలిపారు. అయితే షోలో పాల్గొన్నాం కాబట్టి మ్యుజిషియన్స్ మేము టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని ఆగస్ట్ 8న నా రిపోర్ట్ వచ్చింది.
షూటింగ్ జరిగింది జూలై 31న. అంతకు ముందు నాకు కరోనా వచ్చే అవకాశం లేదు. ఇంట్లో పెద్ద వాళ్లు, 5 నెలల పాప ఉన్నారు. వారి జాగ్రత్తగా చూసుకుంటూ 5 నెలలుగా ఇంట్లోనే ఉన్నాం. సరిగ్గా 5 నెలల తర్వాత షోకి వెళ్లాను. నాకు అనుమానం వచ్చి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని తేలింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా తర్వాత మా అమ్మ,నాన్న, పాపకి వచ్చింది. వాళ్ల రిపోర్ట్ ఆగస్ట్ 9న వచ్చింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు . మేం కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.. బాధలో ఉన్నాం.. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు. బాలుగారి ఫ్యామిలీ కూడా బాధలో ఉంది. ఇలాంటి సందర్భంలో అందరి బ్లెస్సింగ్ కావాలి.
నన్ను దోషిగా నిలబెడుతూ, తప్పుడు మెసేజ్‌ని ప్రచారం చేసే వాళ్ళ వివరాలు సేకరించి సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో మాపై దుష్ప్రచారాలు చేయడం దారుణం. మమ్మల్ని బాధ పెట్టొద్దు. దయ చేసి ఫేక్ మెసేజ్ ని స్ప్రెడ్ చేయోద్దు అని వీడియో ద్వారా కోరింది మాళవిక. కాగా, ఆమె ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుంది.