శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు.
ప్లాంట్ వద్ద పరిస్థతి సమీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో షాట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి 10.30 గంటలకు భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వారిలో 8 మంది సొరంగం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
మిగిలిన తొమ్మిదిమంది సిబ్బంది విద్యుత్ కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీరిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు కాగా, ఇద్దరు అమ్రాన్ కంపెనీకి చెందిన సిబ్బంది ఉన్నారు.