శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.
ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్ తెలిపారు.
విద్యుత్తు కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని సీఈ వివరించారు.