ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట.
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో రకుల్ మేకప్ లేకుండా నటించబోతోందట. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోందట.
`జంగిల్ బుక్` తరహాలో వివిధ జంతువులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రకుల్ రైతు కూలీగా కనిపించబోతోందట.
పల్లెటూరిలో కనిపించే మొరటు రైతు కూలీ యువతిగా, డీ-గ్లామర్ పాత్రలో రకుల్ కనిపించనుందట.
వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నారట