ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు..
తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమయాల్లో పాల్గొన్నారు.
దీంతో.. ఆయనకు సన్నిహితంగా మెలిగిన నేతలు, అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది..
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు కరోనా పాజిటివ్ వచ్చి కోలుకోగా….తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.