గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్‌గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారికి గోవా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 అక్టోబర్‌లో సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసి, ఆయన స్థానంలో గిరిష్ చంద్రముర్మును నియమించిన విషయం తెలిసిందే.
యూపీకి చెందిన ఆయన 1974-77 మధ్య ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1980-86, 1986-89 వరకు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు.
అలాగే 1989-1991 వరకు అలీగఢ్ 9వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్‌లో 2017లో బీజేపీ ప్రభుత్వం ఆయనను బీహార్ గవర్నర్‌గా కొనసాగారు. ఈ సమయంలో ఒడిషా గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలునిర్వహించారు.
ఆగస్టు 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియామకయ్యారు. గతేడాది గోవా 18వ గవర్నర్‌గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాగా, ఇటీవల ఆయన గవర్నర్ల వ్యవస్థపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని గవర్నర్లకు పెద్ద పనేం ఉండదని, జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పని చేసే వారు వైన్ తాగి, గోల్ఫ్ ఆడుతారని’ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి