వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు.
అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కాలని ప్రజలను కోరారు.