కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు.
అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనలతో ఆయన గురుగ్రామ్స్ మేదాంత ఆసుపత్రిలో చేరారు.
అనంతరం కరోనా నుంచి కోలుకున్న ఆయన ఆగస్టు 14న నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు.