మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒక్కే ఒక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని నిన్న తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ”ఈ రోజు 19:29 నుండి నేను రిటైర్ అయినట్లు భావించాలి” అని తెలిపాడు.
అయితే ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్న నిన్న అది కూడా 19:29 కే ఎందుకు వీడ్కోలు ప్రకటించాడు అనే ఓ అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొంరికింది.
అదేంటంటే… నిన్న ధోనితో పాటి రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో ధోని జెర్సీ నెంబర్ 7, రైనాది 3, ఈ రెండు కలిపితే 73 అవుతుంది. ఇక నిన్న భారత్ తన 73 ఏళ్ళ స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకొని 74 ఏటకు అడుగుపెట్టింది.
అందుకే నిన్న వీడ్కోలు చెప్పాడు. ఇక 19:29 ఆ సమయమే ఎందుకంటే ధోని ఆడిన చివరి మ్యాచ్ గత ఏడాది ప్రపంచ కప్ లో భారత్ న్యూజిలాండ్ పై 19:29 కే ఓటమి చెందింది. అయితే ధోని మ్యాచ్ గెలవడానికి ఎంత ఆలోచిస్తాడో అందరికి తెలుసు. కానీ తన వీడ్కోలుకు కూడా ధోని ఆలోచించిన విధానానికి అందరూ షాక్ అవుతున్నారు.