కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే .
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన ఫ్యామిలీకి సేవలు చేసే క్రమంలో నవనీత్‌కు కూడా కరోనా సోకింది.
దీంతో వెంటనే ఆమె చికిత్స కోసం అమరావతి హాస్పిటల్లో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో ముంబై ముంబై లోని లీలావతి హాస్పిటల్లో చేరారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుస్తుంది.