బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయపరంగా బీజేపీకి అనుకూలమని ఎప్పుడూ చెబుతారు. ప్రధాని మోదీకి మద్దతుగా సోషల్‌మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తోందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘నాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నందువల్లే మోదీకి మద్దతునిస్తున్నానని అనుకుంటున్నారు.
అందులో నిజం లేదు. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో మా కుటుంబానికి మంచిపేరుంది.
‘గ్యాంగ్‌స్టర్’ చిత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసేవారు. ‘మణికర్ణిక’ తర్వాత బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చింది. అయితే ప్రస్తుతానికి రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదు’ అని కంగనా పేర్కొంది.