బొజ్జ గణపతులందు ఖైరతాబాద్ గణపతి వేరు! ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ తొండమునేకదంతంతో.. కొండంత రూపంతో భక్తులను కాచేభవహరుడు ఆ స్వామి!!
2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు..
ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు.
ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు