తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నామని పేర్కొన్నా రు.
ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు.
తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్ అని శనివారం అర్ధరాత్రి తెలిసిందని, కోడలు, గన్‌మన్, డ్రైవర్‌కు నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు.