తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరాయి.
వైరస్ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6,24,840 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది.
ఇంకా 1,700 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా 1,587 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 57,586 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉందని, ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.78గా ఉంది. మరో 15,789 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.