ఇటీవల ఓ హీరో పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు.. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఆ యువహీరో వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ హీరోకు అత్యంత సన్నిహితులైన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ పెళ్లికి హాజరయ్యారు.
సెల్ఫీలతో హంగామా చేశారు. ఇటీవల ఆ యువ కథానాయకుడు ఓ విజయన్ని కూడా అందుకోవడంతో ఆ హీరో డేట్స్ అవసరమైన నిర్మాతలు, దర్శకులు కూడా పెళ్లి వద్ద సందడి చేశారు. అయితే ఆ పెళ్ళిలో అతిథులు ఎవరూ కూడా మాస్క్ ధరించి కనిపించలేదు.
సదరు ఫోటోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అంతా బాగానే వుంది అనుకుంటున్న తరుణంలో ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారిన పడ్డారని తెలిసింది.
దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా కంగారు మొదలైంది. దీంతో అందరూ టెస్టులకు క్యూ కడుతున్నారు.
అయితే పెండ్లికి హాజరైన వారు మాస్క్, భౌతికదూరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది