ఈ ఏడాది ఆరంభంలో `భీష్మ`తో విజయం అందుకున్న యంగ్ హీరో నితిన్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే` సినిమాను పూర్తి చేసిన తర్వాత `అంధాధున్` రీమేక్‌ను ప్రారంభించాలనుకుంటున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే చేసిన పాత్రలకు తెలుగులో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాధిక చేసిన పాత్ర కోసం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డేను చిత్రబృందం తాజాగా సంప్రదించినట్టు సమాచారం.
భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఈ సినిమాకు పూజ `నో` చెప్పినట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి పూజ ఈ సినిమాను తిరస్కరించిందట. దీంతో వేరే హీరోయిన్ కోసం చిత్రబృందం ప్రయత్నిస్తోందట