దేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,21,49,351 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ట్విట్టర్లో తెలిపింది.
బుధవారం ఒక్కరోజే 6,64,949 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇదిలాఉండగా దేశంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగున్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 56,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 904 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇవాళ్టి వరకు 19,64,537 కరోనా కేసులు నమోదు కాగా 13,28,337 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
5,95,501 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 40,699 మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.