కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది.
కరోనా వైద్యం అనుమతి రద్దు..
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డెక్కన్ ఆస్పత్రిపై ప్రభుత్వం కొరడా ఝలిపించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వేటు పడ్డ తొలి కార్పొరేట్ ఆస్పత్రి ఇదే.