ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు.
కేంద్ర కేబినెట్ సచివాలయ ఆదేశాలతో 200 మంది కమాండోలను వారి మాతృ శాఖలకు ఇప్పటికే ఎస్పీజీ పంపేసిందని పేర్కొన్నారు.
వీరిలో సీఆర్పీఎ్‌ఫకు చెందిన 86 మంది, బీఎ్‌సఎఫ్ 45, సీఐఎ్‌సఎఫ్ 23, ఎఎ్‌సబీ 24, ఐటీబీపీ17మంది.. ఆర్పీఎఫ్, రాజస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన మరికొందరు ఉన్నారని చెప్పారు.