తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ప్రతిరోజు ఉదయం వార్తలు చూసినట్టుగా ఈ రోజు కూడా వార్తలు చూస్తుండగా ఒక న్యూస్ టీవీ ఛానల్ లో లో వచ్చిన తల్లితండ్రులు లేక అనాధలైన ఆ పిల్లల వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు.ఆయన వెంటనే ఆ సంఘటన జరిగిన ఆ గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆ సంఘటన గురించి తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని అని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు అడగగానే ఆ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య కుటుంబం కొన్నేళ్లుగా ఆనందంగా జీవిస్తుండేది కానీ అనారోగ్యం వల్ల గత సంవత్సరం గట్టు సత్తయ్య చనిపోవడంతో,భార్య అనురాధ, పిల్లలు మనోహర్,లాస్య, యశ్వంత్ కుటుంబం ఒంటరి కావడంతో కూలీ చేసుకొని పిల్లలను చదివించేది కానీ భర్త చనిపోయిన బాధలో ఆమె కూడా మంచం పట్టి రెండు రోజుల క్రితం చనిపోయింది దీంతో ఊరిలోని గ్రామస్థులు,పెద్ద మనుషులు చందాలు వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించారు.దీంతో సంవత్సరం క్రితం తండ్రి,ఇప్పుడు తల్లి చనిపోవడంతో పిల్లలు అనాధలుగా మారారు.దీంతో ఊరి గ్రామస్థులు అందరూ కలిసి వారిని సంరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అనేది ఆ టీవీ న్యూస్ ఛానెల్ లో వచ్చిన వార్త సారాంశం
దీనిని tv చూస్తుండగా గుర్తించిన రాష్ట్ర అ పంచాయతీరాజ్ గ్రామీణ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తక్షణమే ఈ సంఘటన వివరాలను తెలుసుకోవడం కోసం ఆ గ్రామం ఏ నియోజకవర్గ పరిధిలో ఉంది అని తెలుసుకొని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,ఆ గ్రామ సర్పంచ్ లతో మాట్లాడి ఆ పిల్లల వివరాలు తెలుసుకున్నారు తెలుసుకున్న వివరాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కి ఫోన్ చేసి ఇ ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని కోరారు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిల్లలను దత్తత తీసుకోవాలని కోరడంతో దిల్ రాజ్ ఆ ఊరికి తన మనుషులను పంపించి ఆ పిల్లలను దత్తత తీసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి నిర్మాత దిల్ రాజు ఫోన్ చేసి అభినందించారు