పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ శ్రీ జోగు ప్రేమేందర్.
ఈ సందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని శాసన సభ్యులు జోగురామన్న గారు కలిసి పట్టణ అభివృద్ధిపై చేపడుతున్న కార్యక్రమాల సరళిపై చర్చించడం జరిగింది.
ఇటివల మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఎమ్మెల్యే జోగురామన్న గారు రూ.25 లక్షల రూపాయల విలువైన అంబులెన్సు ను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో విస్తృతంగా చర్చించారు.