ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్రమత్స్యశాఖ అధికారులు ప్రకటించారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు.
ఈ ఏడాది 24 చెరువులు, రిజర్వాయర్లలో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.