ఏపీలో చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం… ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది.
— ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు.
— కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని వాళ్లే స్వయంగా నాగలితో ప్రయత్నం చేశారు. దానిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
— వాళ్ళు సరదాగా చేసిన పని వైరల్గా మారి సోనూ సూద్ కి చేరింది.
–వాళ్లకు ట్రాక్టర్ పంపిస్తానన్న సోనూ సూద్ ట్వీట్ తరువాత ఆ రైతుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సీఎం ఆఫీస్ నుండి లోకల్ ఎంపీడీఓ కి సమాచారం వెళ్ళింది.
— ఎంపీడీఓ ఆ ఊరుకి వెళ్ళి విచారించగా అది వాళ్ళు సరదాగా చేసిన వ్యవహారమని వెలుగు చూసింది.
— ఈలోపు సోనూ సూద్ సాయంత్రానికి ట్రాక్టర్ పంపించాడు.
– ఈ మొత్తం వ్యవహారం హిందూ పేపర్లో వచ్చింది.
— ఆ రైతు కూడా మంచివాడే. ట్రాక్టర్ ని తిరిగి ఇవ్వటమో లేక పంచాయితీకి ఇవ్వటమో చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
– దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే.. #సోషల్_మీడియాలో_కనిపించేవన్నీ_నిజాలు_కానక్కర్లేదు. మనం నిర్ధారించుకోవాల్సిందే.
– కానీ ఎక్కడో ముంబైలో ఉండి కూడా తక్షణం స్పందించిన సోనూ సూద్ మాత్రం గ్రేట్.. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. #Sonu_Love_You.
– Hindu news link…
Sonu Sood promises tractor to farmer from Andhra Pradesh’s Madanapalle – The Hindu – https://www.thehindu.com/news/national/andhra-pradesh/sonu-sood-promises-tractor-to-farmer-from-andhra-pradeshs-madanapalle/article32197071.ece