ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి..
మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది
కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
అటు రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు(3405) కూడా కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం..