అతని ప్రతీ అడుగును విమర్శ చేయడం..
వెకిలి మాటలు అనడం అతను ఉద్యమం నుండే చూసిండు..
ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళ మాటలేం తనకు కొత్తకాదు..
విమర్శలు జయించి విజయుడయ్యిండతను..
ప్రతీ విమర్షకు పనితో సమాదానం చేప్పిండు..
వెక్కిరింపులను దిక్కరించి ఒక్కడై నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమించి తానే దిక్కు,దిశయై పోరాటానికి తొలిపొద్దై ఆటుపోట్లను ఎదురిస్తూ కలబడి నిలడిన తాను సాగించిన పోరాటం ప్రజల కళ్ళముందే ఉంది..తెలంగాణా తానందించిన విజయమూ ప్రజల ముందే ఉంది..
అభివృద్ది తెలియదన్నరు,అనుభవం లేదన్నరు..ఈ బక్కమనిషితో తెలంగాణొస్తుందా, అభివృద్దౌతుందా అని హేళన చేసిర్రు..కానీ అతని మొక్కవోని దీక్షతో తెలంగాణా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిండు..
పేద ప్రజల గుండెల దైర్యం నింపిండు..
గరీబులకు సంక్షేమ సారధై నిలించిండు..
ఉద్యమనాయకుడే పాలకుడై బీళ్ళుగా మారిన భూములకు నీళ్ళు తెచ్చిండు..
బిక్కుబిక్కుమంటు బ్రతికిన పేదలకు సంక్షేమం తెచ్చిండు..
తల్లికి పెద్దకొడుకైండు..
ఆడభిడ్డకు మేనమామైండు..
సబ్బండ వర్గాలకు పెద్దదిక్కైండు..
రైతును రాజును చేస్తుండు..పేద ప్రజల గుండెల్లో తాను మనసున్న రాజై నిలిచిండు..
ఇంత గొప్ప మహా వ్యక్తి కేసీఆర్ గారిని పట్టుకుని అడ్డమైన సన్నాసి అడ్డగోలు వాదనలు..అతని కాలు గోటికి కూడా సరితూగని ప్రతీ అడ్డమైన యెదవా అతన్ని ఏదో రకంగా విమర్శించడం..హేళన చేయడం..అసలు విమర్శ ఎలా చేయాలో తెల్వని బద్మాష్ గాళ్ళంతా నేడు ఆయనను ఎగతాళీ చేస్తున్నాం అనుకుంటున్నారు..””సన్నాసుల్లారా ఆయన ఆత్మలింగం లాంటోడు ఎంత పెకిలించాలని చేస్తూ అంత పైకి లేస్తాడు” విమర్శలను జయించి తాను విజయుడైండు..తన మౌనం మీకు చాలా ప్రమాదకరం..సునామి వచ్చేముందు సముద్రమూ ప్రశాంతంగానే ఉంటుంది..అతన్ని తట్టుకునేందుకు సిద్దంగా ఉండండి..
కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే ఆయనను విమర్శిస్తే సరిపోదు.. తెలంగాణాను ఆయనకన్నా ఎక్కువ ప్రేమించగలగాలి..
దటీజ్ కేసీఆర్..
By Telanganavijay