దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత కుటుంబం మహిళా కమిషన్ ను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది.