ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలకు కరోనా సోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో మంత్రి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో బుధవారం జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహావిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు.
దీంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలవగా, ఆ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం హోం క్వారంటైన్ వెళ్లిపోయారు.