ఎన్నో హంగులతో తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 10 డిజైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్..
చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ డిజైన్ కు ఆయన ఓకే చెప్పారు. మొత్తం 25 ఎకరాల్లో 20% బిల్డింగ్, 80% పార్కులు ఉండేట్లు రూపకల్పన చేశారు.
ఇందులోనే ప్రార్థన స్థలాలు, బ్యాంకు ఏటీఎంలు, క్యాంటీన్లు ఉంటాయి. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 కోట్లు అవుతుందని భావిస్తున్నారు