ఏపీలో సంచలనమైన మచిలీపట్నంలో హత్యకు గురైన వైసీపీ నేత మీకు భాస్కరరావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గత నెల 29న జరిగిన ఈ హత్య కేసులో నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును పోలీసులు FIR లో చేర్చారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు.. రవీంద్రతో మాట్లాడినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొల్లు రవీంద్రను పోలీసులు రేపు అరెస్ట్ చేసి.. విచారించే అవకాశం ఉంది.