ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు.
ఈ తరుణంలో సదరు ఎంపీపై అనర్హత వేటు పడి నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలోస్తే గెలుపు ఎవరరిది.ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు అని తదితర అంశాలపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు ఒక సర్వే చేపట్టింది.మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో 11,74,444ఓటర్లున్నారు.
వీరిలో ఐదువేల మంది అభిప్రాయాలను సేకరించడం జరిగింది.ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలోస్తే సీఎం జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పార్టీకి 70%మంది తమ ఓటు వేస్తామని తెలిపారు.
మరోవైపు ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి 23%,పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 5-6%,బీజేపీకి 1%మంది తమ ఓట్లను వేస్తామని ఈ సర్వేలో వెల్లడించారు.
సర్వే చేసిన ఐదువేల మంది అభిప్రాయాల్లో వైసీపీకి 3,310,టీడీపీకి 1,290,జనసేనకు 300,బీజేపీకి 100మంది జై కొట్టారు. దీని ప్రకారం వైసీపీ అభ్యర్థికి 8లక్షలకు పైచిలూ..టీడీపీ అభ్యర్థికి 2.50లక్షలు…జనసేన అభ్యర్థికి 10-20వేల ఓట్లు,బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేకుండా ఓట్లు పడతాయని సర్వేలో తేలింది.
నియోజకవర్గంలో నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ కి 49 .95 శాతం ,టీడీపీ కి 39 .18 శాతం , జనసేన కు 6.8 శాతం ఓట్లు వచ్చాయి.అయితే ఈ సర్వే లో ప్రజాభిప్రాయం పై విధంగా వుంది.
వైసీపీ అభ్యర్థికి తాము ఓట్లు వేయడానికి
* వాలంటీర్ ,గ్రామ వార్డు సచివావాలయం పట్ల సర్వత్రా ప్రశంసలు
* రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా అవినీతి బాగా తగ్గింది
* మధ్య నియంత్రణ పట్ల మహిళల్లో జగన్ పాలనపై పూర్తి సంతృప్తి
* పార్టీ కులం మతం చూడకుండా అర్హులందరికీ అన్ని సంక్షేమ పధకాలు అందుతుండటం
* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై నియంత్రణ చర్యలు
* ఈసీ నిమ్మగడ్డ బాబు మనిషి, కొన్ని వ్యవస్థలను , TDP అను కుల ప్రభుత్వ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని జగన్ ను ఇబ్బంది పెడుతున్నాడని బాబుపై ప్రజల్లో నాటుకుపోవడం
* గత ఎన్నికల్లో రఘు రామరాజును చూసి కాకుండా జగన్ ను చూసి వేసాము అని చెప్పారు.
* రాజులు కూడా తప్పు చేస్తున్నాడు రఘురామరాజు అని అన్నారు
* 30 ఏళ్ళు దాటిన కాపులు కూడా జగన్ కరెక్టు, పవన్ సినిమాలు చేసుకొంటే బాగుంటుందని అభిప్రాయాన్ని కల్గి ఉండటం
* ఇసుక సమస్య అక్కడ లేదు , బుక్ చేసిన రెండు మూడు రోజులకు అందుతోండటం
లాంటి తదితర అంశాలపై సానుకూలంగా ఉండటం కల్సి వచ్చిందని దరువు నిర్వహించిన సర్వేలో తేలింది.