దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్ కల్యాణ్ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు.
కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు.
గడిచిన 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజల కుటుంబాలకు రూ. 31 వేల కోట్లను డిపాజిట్ చేశామన్నారు. అదేవిధంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లను జమచేసినట్లు ప్రధాని పేర్కొన్నారు.