తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.
తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెట్లు నాటాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు మొక్కలు నాటారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వంద మంది యువకులు రక్త దానం ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
అన్ని మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనడం జరిగింది