రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విదతలో భాగంగా దేతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన రెడియో జాకీ చైతు.
ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పది.
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురికి గాయకుడు హేమచంద్ర; రేడియో జాకీ కాజల్; యువ నటుడు కిరణ్ అబ్బవరం లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.