సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి..
– ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి.
– అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.
– కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వాలి.. వారిని గౌరవించాలి..
– దక్షిణ భారత దేశం నుండి
ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పీవీ .
– గొప్ప సంస్కరణలకు నాంది పలికింది వ్యక్తి పీవీ గారు..
– రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్ ని ఒక ఏకనమిస్ట్ ని తీసుకువచ్చిన వ్యక్తి పీవీ..
– నిరాడంబరతకు నిదర్శనం పివి నరసింహ రావు గారు..
– మన రాజివ్ రహదారి సేవలు మనం పొందుతున్నాం అంటే.. మరియు ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట కరీంనగర్ , మంచిర్యాల , పెద్దపల్లి , మంథని ప్రాంతాల్లో రాజీవ్ రహదారి సేవలు అందుతున్నాయి అంటే పివి గారి కృషి ఎంతో ఉంది…
– పీవీ గారి కష్టాన్ని , సంస్కరణలు ,పరిపాలనను, ఈరోజు ప్రభుత్వాలు పాలకులు, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలి..
– ఈ దేశం మరింత అభివృద్ధి చెందే విదంగా వారి సంస్కరణలు కొనసాగిస్థాయి..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼