ఆరవ విడత హరిత హారంలో భాగంగా
రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు.
– సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా మొక్కలు నాటాలని, ఆ ప్రాంతంలో మియావాకీ ఏర్పాటు చేసేలా డీఎఫ్ఓ సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి సూచించారు.
– కాళ్లకుంట, కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.