ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు.
గొంతు మంట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అని ఈ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలు వైరస్‌కు గురైన 2 నుంచి 14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.