బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి… ఈసారి ఇందులో నలుగురు హీరోయిన్స్ పాల్గొంటున్నారు అని తెలుస్తుంది.
”శ్రద్దా దాస్, యామినీ భాస్కర్, ప్రియా వడ్లమాణి, హంసా నందిని” ఈ నలుగురు హీరోయిన్స్ ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని సమాచారం. అయితే ఈ నలుగురు ఒప్పుకున్నారా… లేదా అనేది మాత్రం తెలియదు.
కానీ వీలైనంత త్వరగా షో ప్రారంభించాలని చూస్తున్నా… ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది చివర్లో బిగ్ బాస్ నాల్గో సీజన్ ను ప్రారంభిస్తారు అని తెలుస్తుంది.