దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల నమోదులో భారత్లో మరో కొత్త రికార్డు నమోదైంది. భారత్లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది.
అత్యధికంగా నిన్న ఒక్కరోజే 17,296 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,90,401లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజకు ఉదయం వెల్లడించగా.. తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో నమోదు కావడంతో మొత్తం కేసులు 5లక్షలు దాటేశాయి.
దేశంలో మరణాల సంఖ్య 15,600 దాటింది. కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ.. కోలుకున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటం ఉపశమనం కలిగించే విషయం. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 2,85,637మంది కోలుకోవడంతో రికవరీ రేటు 58.25 %గా ఉంది.