మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి.
దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది.
వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.