కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది.
మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది.
తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రకు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది