పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది.
ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు.
అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో పీవీ వైఫల్యం ఏమీలేదు. వాస్తవానికి ఇందిరాగాంధీతో పీవీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
ఇందిరాగాంధీ పీవీని ఎంతగానో నమ్మేది. ఆ నమ్మకంతోనే ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను ఇచ్చారు.