తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలయింది.సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అల్లనేరెడ్ మొక్కను నాటి ప్రారంభించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి అని సూచించారు.అంతే కాకుండా ఈచ్ వన్..ఫ్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు సాగాలి.
మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆయన అన్నారు.భవిష్యత్ తరాలకు ఆకుపచ్చని తెలంగాణను కానుకగా అందించాలి.దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో 110ఎకరాల హెచ్ఎండీఏ భూములను చిట్టడవిగా మార్చనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు..