తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,364కి చేరింది.
ఇందులో 6,446 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్లలో చికిత్స పొందుతుండగా.. 4,688 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
గురువారం కరోనాతో ఐదుగురు మరణించగా.. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 230కి పెరిగింది.