ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
1765 ఎకరాల్లో నర్సాపూర్ ఆర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్, అడవుల పునరుజ్జీవంలో భాగంగా ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించనున్నారు.
ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఇక్కడకు చేరుకుంటారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం పార్కులో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ అల్లనేరేడు మొక్క నాటనున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.