ఇంజక్షన్ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా ఔషధాలను తయారు చేస్తున్న ఈ సంస్థ రెమ్డీస్వీర్ జనరిక్ మందును ఇంజక్షన్ రూపంలో తీసుకొస్తున్నది. కోవిఫర్ బ్రాండ్ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు వారాల్లో లక్ష ఇంజక్షన్లు తయారు చేయనున్నట్లు పేర్కొంది.
తర్వాత బ్యాచ్ కరోనా ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవాలకు సరఫరా చేయనున్నట్లు హెటిరో వెల్లడించింది. 100 మిల్లీగ్రాముల కరోనా ఇంజక్షన్ ధర రూ.5,400గా హెటిరో తెలిపింది. ప్రస్తుతం ఈ కరోనా ఇంజక్షన్ ప్రభుత్వం, దవాఖానల్లోనే అందుబాటులో ఉంటుందని, మందుల షాపుల్లో ఇప్పుడే లభించవని పేర్కొంది.
మరోవైపు ఇదే జనరిక్ మందును తాము కూడా తయారు చేస్తున్నట్లు అమెరికా ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సిప్లా తెలిపింది. ఇంజక్షన్ ధర మాత్రం రూ.5000 లోపే ఉంటుందని చెప్పింది. కాగా, క్లినికల్ ట్రయల్స్‌తోపాటు అత్యవసర కరోనా రోగులకు ఈ ఇంజక్షన్ ఇచ్చేందేకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ యాంటీ వైరల్ మందు కరోనాను నియంత్రిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, దక్షణ కోరియా దీనిని పాక్షికంగా అనుమతించగా జపాన్ మాత్రం పూర్తిగా ఆమోదం తెలిపింది.