తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలకు ప్రయివేట్ ఆసుపత్రులకు,ల్యాబ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి విదితమే.
అయితే కరోనా పరీక్షలను సర్కారు నిర్ణయించిన ధరకే నిర్వహిస్తామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.అయితే గుండె ,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారికి మాత్రం ఆయా ధరలు యధాతథం అని తెలిపింది.
కరోనా లక్షణాలు ఉండి పాజిటీవ్ వచ్చినవారు ఇండ్లలోనే క్వారంటైన్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్,టెలి మెడిషన్ ద్వారా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుందని వారు అన్నారు..